పరులతీపి
(ఐదోగజల్)
గజలుపేరు మురికిచేసి బలిచేసెనునీతినొకడు
గజలుతీరు దొరకజూసి వలవేసెను ప్రేతమొకడు
గజలుఖీరు పరులతీపి తనతల్లినిమరపించెర
గుజరికోరి పరువుజోపి విరిచెభృంగిచేతినొకడు
పరులపాట కలుపుదోపి తెలుగుపైరు వెరపందెర
కరువుదీర తెలుగుజూపి కలిసిరండి వీథికొకడు
పరుగుతూట కలముదోపి కవులందరుకదలండిర
పెరుగుమూటకలిమిమోపు
నిలబడండి నీతికొకడు
తరుణిఛోటి కవిసందిత గజలుబాట పట్టిందిర
కరుణతోటి చేయిచాపి
కలిసిరండి రీతికొకడు
శ్రీమతి జి సందిత బెంగుళూరు
No comments:
Post a Comment