ఏమిటోయి నీ బాట (ఏడో గజల్)
మనసుకుంచె మంచిదైతె పూసిందొక అందమౌను
మనసుసంచి కొంచెమైతె చూసిందొక నిందయౌను
సొగసునెంచి మంచిమరచి ఏమిటోయి నీవేట
చెల్లినెంచి తల్లినెంచి చేసిందొక బందమౌను
ఉరుసునెంచి పొంచినిలిచి ఏమిటోయి నీ బాట
అన్నెమెంచి పున్నెమెంచి పూసిందొక గందమౌను
ఇరుసునెంచి పూన్చిసరుకు చూపవోయి నీ కాట
తాకునెంచి తప్పునెంచి చేసిందే చందమౌను
గురువునెంచి కవిసందిత పాడెనోయి యీపాట
ఖుదానెంచి ఖురానెంచి రాసిందే జింద యౌను
శ్రీమతి జి సందిత బెంగుళూరు